కరోనా వైరస్ కట్టడిలో పారిశుధ్ధ్య నిర్వహణ చాలా కీలకమని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డా.శిరీష అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో శానిటరీ అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. పారిశుద్ధ్య నిర్వహణలో తిరుపతి ఆదర్శంగా ఉండేలా చూడాలని కోరారు.
ఇంటింటా చెత్త సేకరణ కార్యక్రమం సక్రమంగా జరగాలని సూచించారు. ఎవరైనా ప్లాస్టిక్ వినియోగిస్తే భారీ ఎత్తున జరిమానా విధించాలని ఆదేశించారు. షాపులు, వ్యాపార సంస్థలకు ట్రేడ్ లైసెన్స్ ఉండాలన్నారు. కోవిడ్ కారణంగా అన్ని డివిజన్లో ప్రతిరోజు శానిటైజేషన్ చేయాలని దిశానిర్దేశం చేశారు.