ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

suicide: వివాహిత ఆత్మహత్య.. అత్తింటి వేధింపులే కారణమని తండ్రి ఆరోపణ - Married woman suicide latest news

చిత్తూరు జిల్లా కందులవారిపల్లికి చెందిన వివాహిత.. ఆత్మహత్య చేసుకుంది. అత్తింటి వారి వేధింపులే కారణమని మృతురాలి తండ్రి చేసిన ఆరోపణలతో.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Married woman suicide
వివాహిత ఆత్మహత్య

By

Published : May 31, 2021, 9:12 AM IST

చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని కందులవారిపల్లికి చెందిన మల్లికార్జున్, పాకాల మండలం దామలచెరువుకు చెందిన మునీశ్వరి.. మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ సమయంలో... రెండు కుటుంబాలు మధ్య మనస్పర్థలు తలెత్తినా.. కొన్ని రోజులకు అన్నీ సర్దుకున్నాయి.

మల్లికార్జున్, మునీశ్వరిలకు ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. అనంతరం ఆర్థిక ఇబ్బందులు చుట్టు ముట్టటంతో.. అత్తింటి నుంచి వేధింపులు మొదలయ్యాయి. మునీశ్వరి తల్లిదండ్రులకు బాధను చెప్పుకోలేక.. కట్టుకున్న భర్త బాధ్యత లేకుండా తిరగటంతో కలత చెందింది.

అత్తింటివారి హత్యే..

మూడు నెలల పసిబిడ్డతో మూడు రాత్రులు నిద్ర చేసేందుకు అత్త ఇంటికి వచ్చిన ఆమె.. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకొన్న చంద్రగిరి పోలీసులు సంఘటనా స్థలికి చేరుకొని.. మృత దేహాన్ని శవపరీక్ష నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. తన బిడ్డను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించినట్లు మృతురాలి తల్లిదండ్రులు చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదు చేయటంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇవీ చూడండి:

64 ఏళ్ల వయస్సులో... 43 మృతదేహాలకు అంత్యక్రియలు

ABOUT THE AUTHOR

...view details