తిరుపతి బాలాజీ కాలనీ కూడలిలో పహరా కాస్తున్న పోలీసులు టౌన్‌క్లబ్ వైపు నుంచి ద్విచక్రవాహనంపై వేగంగా వస్తున్న ఓ యువకున్ని ఆపారు. లాక్‌డౌన్ సమయంలో బయట తిరగటాన్ని ప్రశ్నించడంతో ఆగ్రహించిన యువకుడు పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. తాళం చెవి తీసుకోవడంతో వేగంగా వెళ్లి పక్కనే ఉన్న చెట్టు ఎక్కి దూకుతానంటూ బెదిరించాడు. ఆ యువకుడిని చెట్టు దింపడానికి పోలీసులు గంట పాటు కష్టపడ్డారు. డ్రామాకు తెరదించుతూ యువకుడు చెట్టు దిగడంతో పోలీసులు ఊపిరి పీల్చుకొన్నారు. చెట్టు దిగిన యువకుడు... లైసెన్స్ ఉన్నా నన్నెందుకు ఆపారంటూ ప్రశ్నించడంతో అవాక్కైన పోలీసులు... బండితో పాటు అతన్ని స్టేషన్‌కు తరలించారు.
'చెట్టు దిగరా... తాళమిస్తా...'
లాక్‌డౌన్ సమయంలో రహదారిపై తిరగొద్దని వారించడమే తిరుపతి పోలీసుల పాలిట శాపంగా మారింది. వాహనాన్ని ఆపి... తాళం చెవులు తీసుకోవడంతో ఆగ్రహించిన ఓ యువకుడు చెట్టెక్కాడు. పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకొంటానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో అవాక్కైన పోలీసులు... ఆ యువకుడికి నచ్చచెప్పడానికి ఆపసోపాలు పడ్డారు.
తిరుపతిలో యువకుడి ఆత్మహత్యాయత్నం