చిత్తూరు జిల్లాలో తండ్రిని హత్య చేసిన కేసులో నిందితుడైన తనయుడు సునీల్ అలియాస్ పండును మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు గంగవరం సీఐ రామకృష్ణాచారి తెలిపారు. ఈ నెల 14న బాపలనత్తం గ్రామానికి చెందిన చిన్నబ్బ, అతడి కుమారుడు సునీల్ మద్యం మత్తులో ఇంటి స్థలం విషయమై ఘర్షణ పడ్డారు. తండ్రిని తనయుడు కర్రతో బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.
తండ్రి హత్య కేసులో తనయుడి అరెస్టు - etv bharat telugu updates
చిత్తూరు జిల్లాలో తండ్రిని హత్య చేసిన కేసులో నిందితుడైన తనయుడు సునీల్ అలియాస్ పండును మంగళవారం పోలీసులు
తండ్రి హత్య కేసులో తనయుడి అరెస్టు
ఈ ఘటనలో గాయపడిన సునీల్ పలమనేరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తీసుకుని మంగళవారం డిశ్ఛార్జి కాగా అతన్ని అరెస్టు చేసినట్లు చెప్పారు. నిందితుడు హత్యకు ఉపయోగించిన కర్రను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు వివరించారు. ఎస్సై మునిస్వామి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఇవీ చూడండి:జోరందుకున్న ఆటోమొబైల్ అమ్మకాలు