ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మదనపల్లెను జిల్లాగా ప్రకటించే వరకు ఉద్యమం ఆపేది లేదు' - మదనపల్లె జిల్లా సాధన సమితి తాజా వార్తలు

మదనపల్లెను జిల్లాగా ప్రకటించాలని మదనపల్లె జిల్లా సాధన సమితి డిమాండ్ చేసింది. జిల్లా సాధన కోసం చేపట్టే ఉద్యమాలకు ప్రజలు మద్దతు తెలపాలని తంబళ్లపల్లిలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో నేతలు కోరారు.

madanapalle jilla sadhana samithi conduct all party conference
'మదనపల్లెను జిల్లాగా ప్రకటించే వరకు ఉద్యమం ఆపేది లేదు

By

Published : Nov 20, 2020, 6:46 PM IST

దేశంలో అతి పెద్ద రెవెన్యూ డివిజన్ అయిన చిత్తూరు జిల్లాలోని మదనపల్లెను జిల్లా ప్రకటించాలని మదనపల్లె జిల్లా సాధన సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు సాధన సమితి ఆధ్వర్యంలో తంబళ్లపల్లిలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాల విషయంలో గతంలోనూ మదనపల్లి, తంబాలపల్లి, పీలేరు, పుంగనూరు ప్రాంతాలకు అన్యాయం జరిగిందని నాయకులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రానికి కావాల్సిన అన్ని వసతులు మదనపల్లికి ఉన్నాయని.. అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న ఈ డివిజన్​ను జిల్లాగా ఏర్పాటు చేస్తే అభివృద్ధికి నోచుకుంటుందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.

జిల్లా సాధన కోసం చేపట్టే ఉద్యమాలకు మద్దతు ఇవ్వాలని నియోజకవర్గ ప్రజలను అఖిలపక్ష నాయకులు కోరారు. ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకునే వరకు ఉద్యమాలు ఆపేది లేదని హెచ్చరించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details