చిత్తూరు జిల్లా మదనపల్లి గ్రామీణ మండలంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసింది. మండలంలోని కృష్ణాపురానికి చెందిన స్రవంతి (21), చీకలబైలు గ్రామానికి చెందిన అమర(22)... గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఐతే పెద్దలు తమ ప్రేమను అంగీకరించరనే అనుమానంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. స్థానికులు గుర్తించి వారిని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.
మదనపల్లిలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం - మదనపల్లిలో ప్రేమ జంట తాజా వార్తలు
తమ ప్రేమను పెద్దలు అంగీకరించరనే అనుమానంతో ఓ ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లి గ్రామీణ మండలంలో జరిగింది. వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు.
బాధితురాలు