చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం అగరం గ్రామంలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పరివార దేవతలకు ప్రత్యేక ఆలయాలు నిర్మించారు. మందిర ప్రాంగణంలోని శివాలయం ఎదుట నంది విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గత కొన్ని రోజుల క్రితం విగ్రహ పీఠానికి పగుళ్లు ఏర్పడటంతో శాస్త్రోక్తంగా పగుళ్లు పూడ్చి పునః ప్రతిష్ఠించారు.
నిధులు ఉన్నాయని వదంతులు వ్యాప్తి...
నంది విగ్రహాన్ని పునః ప్రతిష్ఠించిన నాటినుంచి... విగ్రహం కింద విలువైన ఆభరణాలు ఉంచారని వదంతులు వ్యాప్తి చెందాయి. ఈ క్రమంలోనే గుర్తు తెలియని దుండగులు... శనివారం ఆర్థరాత్రి నంది విగ్రహాన్ని పెకిలించి, ధ్వంసం చేశారు. ఆదివారం ఉదయం ఆలయానికి వెళ్లిన కమిటీ సభ్యులు... నంది విగ్రహం ధ్వంసం ఉండటాన్ని గమనించి పోలీసులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు... ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. జిల్లా ఎస్డీపీవో ఈశ్వర్ రెడ్డి.. ప్రత్యేక బృందంతో విచారణ చేపట్టారు.
ఇదీచదవండి.