తిరుపతి ఉప ఎన్నికల్లో తెదేపా ప్రచారాన్ని విస్తృతం చేసింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్... సత్యవేడు నియోజకవర్గ పరిధిలోని వరదయ్యపాలెం మండలంలో ప్రచారం నిర్వహించారు. మండల కేంద్రం వరదయ్యపాలెంలోని చెంగాలమ్మగుడి, తూర్పు వీధి, బజార్ వీధి, గోవర్ధనపురం, పద్మావతిపురం, ఇందిరానగర్ సెంటర్, సి.ఎల్.ఎన్ పల్లి, లక్ష్మిపురం ప్రాంతాలలో ఇంటింటి ప్రచారం చేశారు.
గడిచిన రెండు సంవత్సరాల్లో వైకాపా పాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించారు. 21 మంది ఎంపీలు పార్లమెంటుకు వెళ్లి ఏం సాధించారు అని లోకేశ్ నిలదీశారు. హోదా, ఉక్కు, పోలవరం, రైల్వే జోన్‌పై నిలదీసింది తెదేపా ఎంపీలేనని లోకేశ్ అభిప్రాయపడ్డారు. పార్లమెంటులో ప్రశ్నించే గళం కావాలి.. భయపడేవారు కాదన్నారు. ప్రజలకు సేవ చేసేవారు కావాలా.. జగన్‌కు సేవ చేసేవారు కావాలా అని లోకేశ్ ప్రశ్నించారు.