చిత్తూరు జిల్లా పీలేరు పట్టణ సమీపంలోని కోళ్ల ఫారం వద్ద ఉన్న గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న క్వారంటైన్ కేంద్రాన్ని తీసేయాలని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ కేంద్రం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
గురుకుల పాఠశాలలో క్వారంటైన్ వద్దని ఆందోళన - గురుకుల పాఠశాలలో క్వారంటైన్ వద్దంటూ స్థానికుల ఆందోళన..
చిత్తూరు జిల్లా పీలేరు పట్టణ సమీపంలోని గురుకుల పాఠశాలలో నిర్వహిస్తున్న క్వారంటైన్ కేంద్రం వద్దని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు.
గురుకుల పాఠశాలలో క్వారంటైన్ వద్దంటూ స్థానికుల ఆందోళన..
చిత్తూరు - పీలేరు ప్రధాన రహదారిపైకి చేరుకున్న స్థానికులు వాహనాలను నిలిపి వేసి ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులకు సర్ది చెప్పారు. లాక్ డౌన్ అమల్లో ఉన్నందువల్ల రహదారిపై ఆందోళన చేయకూడదని, ఏమైనా సమస్యలు ఉంటే స్థానిక రెవెన్యూ అధికారులతో మాట్లాడాలని, వెంటనే ఆందోళన విరమించాలని స్థానికులకు తెలియజేయడంతో వారు ఆందోళన విరమించారు.
ఇది చదవండికరోనాపై అవగాహన కల్పిస్తూ పోలీసుల ర్యాలీ