తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబును పోలీసులు గృహనిర్బంధం చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యాహ్నం ఒకటిన్నర గంటల సమయంలో మదనపల్లి టౌన్ నీరుగట్టువారిపల్లిలోని మాయాబజార్ పోలీస్ స్టేషన్‌ను శ్రీరామ్ సందర్శించారు. ఈ క్రమంలో ఠాణా లోపలికి వెళ్లేందుకు శ్రీరామ్‌ను పోలీసులు అనుమతించకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు... పోలీసుల చర్యను వ్యతిరేకించారు. అధికార పార్టీకి సహకరిస్తూ... పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
శ్రీరామ్ చిన్నబాబు గృహనిర్బంధంపై స్థానికుల ఆగ్రహం - chithore district latest news
చిత్తూరు జిల్లా మదనపల్లె మాయాబజార్ పోలీస్ స్టేషన్‌ను తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు సందర్శించారు. ఈ క్రమంలో శ్రీరామ్‌కు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు... పోలీసుల తీరును తప్పుబట్టారు.
తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు