చిత్తూరు జిల్లా తిరుపతి రూరల్ మండలం వేదాంతపురం పంచాయతీ పరిధిలోని వినాయకనగర్‌లో ఇళ్లు కోల్పోయిన బాధితులను జిల్లా తెదేపా అధ్యక్షుడు పులివర్తి నాని పరామర్శించారు. నోటీసులు ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు ఇళ్లు కూల్చటం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వారి జీవితాలను బజారుపాలు చేశారని మండిపడ్డారు. ఎన్నికల నియమావళిని ఆసరాగా చేసుకుని ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తే ప్రజలతో కలిసి తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు త్వరలోనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూల్చటం దారుణం - officers
నోటీసులు ఇవ్వకుండా రెవెన్యూ అధికారులు పేదల ఇళ్లు కూల్చటం దారుణమని చిత్తూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు పులివర్తి నాని ఆవేదన వ్యక్తం చేశారు.
తెదేపా నేత పరామర్శ