చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణం దళితవాడలో పూజ అనే వివాహిత... అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. చేసిన అప్పులు తీర్చలేక మనస్థాపంతో.. ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని... సీఐ వెంకట్రామిరెడ్డి తెలిపారు. పూజకు ఆరు సంవత్సరాల క్రితం.. అదే ప్రాంతానికి చెందిన సాయికుమార్‌తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. వృత్తిరీత్యా పారిశుద్ధ్య కార్మికుడైన సాయి కుమార్.. విరామ సమయంలో ఆటో నడిపేవాడు.
ఇటీవలే పూజ పొదుపు సంఘంలో చేరి.. కొంత నగదు అప్పు తీసుకుంది. నెలనెలా రుణాన్ని చెల్లించేటట్లు ఒప్పందం పెట్టుకున్నారు. అయితే ఈ నెల నగదు మెుత్తాన్ని.. పూజా తన భర్తకు ఇచ్చినా, సాయి కుమార్ వాటిని విలాసాలకు ఖర్చుపెట్టేశాడు. ఈ విషయంపై భర్తను నిలదీసి.. అప్పును చెల్లించలేననే మనస్థాపంతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.