చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని గ్రామీణ మహిళలు తాగునీటి ఎద్దడిపై ధర్నా చేశారు. ఖాళీ బిందెలతో కుప్పం మండల సచివాలయం ఎదుట నిరసన తెలిపారు. 'కావాలి నీళ్లు కావాలి నీళ్లు' అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వ ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేయకపోవడం వల్ల కష్టాలు తప్పడం లేదని మహిళలు వాపోయారు. తమ బకాయిలు ఇప్పటి వరకూ చెల్లించనందున నీటి సరఫరా ట్యాంకర్లు ఆపేశామని కాంట్రాక్టర్లు తెలిపారు.
'కావాలి నీళ్లు' అంటూ కుప్పం గ్రామీణ మహిళల ధర్నా - kuppam ladies protest latest news
'కావాలి నీళ్లు కావాలి నీళ్లు' అని నినాదాలు చేసుకుంటూ కుప్పం మండల గ్రామీణ మహిళలు స్థానిక సచివాలయం ఎదుట ఆందోళన చేశారు. ఖాళీ బిందెలతో తాగునీటి ఎద్దడిపై తమ నిరసన తెలిపారు.
ఖాళీ బిందెలతో ధర్నా చేసిన కుప్పం మహిళలు