ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జోరందుకున్న శ్రీకాళహస్తి సుందరీకరణ పనులు

శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న కైలాసగిరి పర్వత శ్రేణులు, భరద్వాజ తీర్థం, భక్త కన్నప్ప కొండ ప్రాంతాలను పర్యాటక ధామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

జోరందుకున్న శ్రీకాళహస్తి సుందరీకరణ పనులు

By

Published : May 3, 2019, 8:40 PM IST

జోరందుకున్న శ్రీకాళహస్తి సుందరీకరణ పనులు

చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా ఉన్న కైలాసగిరి పర్వత శ్రేణులు, భరద్వాజ తీర్థం, భక్త కన్నప్ప కొండ ప్రాంతాలను పర్యాటక ధామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గతేడాది జులైలో 4 కోట్ల 20 లక్షల వ్యయంతో కైలాసగిరి సుందరీకరణ పనులను ప్రారంభించింది. ప్రస్తుతం భరద్వాజ తీర్థం నుంచి భక్త కన్నప్ప కొండకు వెళ్లేందుకు వీలుగా రోడ్డు నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. కైలాసగిరిలోని మట్టి నిల్వలను ఇక్కడకి తరలిస్తూ పనులను చకచక చేస్తున్నారు . భక్త కన్నప్ప కొండపై 80 లక్షలు వ్యయంతో 100 అడుగుల ఎత్తులో నిర్మించనున్న శివపార్వతుల విగ్రహాల పనులు జోరుగా సాగుతున్నాయి. రానున్న రోజుల్లో ఆలయానికి వచ్చే యాత్రికులు, పర్యాటకులను ఈ ప్రదేశం మరింత కనువిందు చేయనుంది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details