చిన్నారిని అపహరించిన నాలుగు గంటల్లోనే నిందితుడ్ని పట్టుకున్నారుతిరుపతి పోలీసులు.తిరుపతి నగరంలో పారిశుద్ద పనులు చేసుకునే దంపతుల మూడేళ్ల చిన్నారిని ఓ దుండగుడు అపహరించాడు.తల్లి తండ్రులు ఫిర్యాదుతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల సాయంతో,నాలుగు గంటల్లోనే చిన్నారిని గుర్తించారు.చిత్తూరులో చిన్నారి ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు,నిందుతుడిని అదుపులోకి తీసుకుని చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించారు.
చిన్నారి అపహరణ..నాలుగుగంటల్లో గుర్తింపు - కేసు
గురువారం మధ్యాహ్నం తిరుపతిలో భాగ్యలక్ష్మి అనే చిన్నారిని దుండగుడు అపహరించాడు. రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక సాయంతో నిందితుడిని నాలుగు గంటల్లోనే గుర్తించారు.
చిన్నారి అపహరణ కేసును నాలుగుగంటల్లోనే ఛేదించిన తిరుపతి పోలీసులు