గుడిలోనే గుండెపోటుతో మృతి - died
దైవదర్శనానికి కుటుంబసమేతంగా కర్ణాటక నుంచి ఆంధ్రాకు వచ్చారు. దర్శనం అనంతరం తిరిగి వెళ్తుండగా ఆలయన ప్రాగణంలోనే ఓ భక్తుడు శివైక్యం చెందాడు. ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో చోటుచేసుకుంది.
మృతదేహం వద్ద రోధిస్తున్న కుటుంబ సభ్యులు
బెంగుళూరులోని ఇందిరానగర్‌కు చెందిన విశ్రాంత ఇంజినీర్ నాగరాజు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వరాలయానికి వచ్చారు. దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో ఉండగా గుడి ప్రాంగణంలో గుండెపోటు వచ్చింది. ఆలయ అత్యవసర వాహన సేవల సిబ్బంది హుటాహుటిన స్థానికి ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే మృతి చెందారు.దైన సన్నిధానానికి వచ్చి పెద్ద దిక్కును కోల్పోవడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగారు.