ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమలలో కారీరిష్టి యాగం పరిసమాప్తి

సకాలంలో వర్షాలు కురిసి... పాడి పంటలతో దేశం కళకళలాడుతూ ఉండాలని కోరుతూ తిరుమలలో చేపట్టిన వరుణ యాగం ముగిసింది. ఐదు రోజుల పాటు రోజుకో ప్రత్యేకతతో సాగిన ఈ యాగం... మహాపూర్ణాహుతితో సమాప్తమైంది.

'మహా పూర్ణాహుతితో ముగిసిన కారిరిష్ఠి యాగం'

By

Published : May 18, 2019, 5:53 PM IST

'మహా పూర్ణాహుతితో ముగిసిన కారిరిష్ఠి యాగం'

తిరుమలలో ఐదురోజులుగా నిర్వహిస్తున్న వరుణయాగం... పూర్ణాహుతి కార్యక్రమంతో వైభవంగా ముగిసింది. దేశం నలుమూలలా వర్షాలు సమృద్ధిగా కురిసి... పాడి, పంటలతో ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ కారీరిష్టి పేరుతో తితిదే ఈ యాగం నిర్వహించింది. ఐదు రోజులుగా పార్వేట మండపం వద్ద వరుణయాగం, వరాహపుష్కరిణి చెంత వరుణజపం, ఆస్థాన మండపంలో విరాటపర్వం పారాయణం, నాదనీరాజనం వేదికపై అమృతవర్షిణి రాగాలాపన... కపిలతీర్థంలో పర్జ్యన్య శాంతియాగాలను రుత్వికులు నిర్వహించారు. చివరగా మహాపూర్ణాహుతితో క్రతువును ముగించారు.

ABOUT THE AUTHOR

...view details