ప్రజా సమస్యలపై త్వరలో.. "జనసేన" యాత్ర: వరప్రసాద్ - ycp
ప్రజా సమస్యలపై త్వరలో జనసేన యాత్ర నిర్వహించనున్నట్టు ఆ పార్టీ శాసన సభాపక్ష నేత వరప్రసాద్ తెలిపారు. తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం ఆయన మాట్లాడారు.
janasena mla
వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్ ఆరోపించారు. తిరుమలలో వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో వరప్రసాద్ స్వామివారిని దర్శించుకున్నారు. త్వరలో ప్రజా సమస్యలపై జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ యాత్ర చేపట్టనున్నారని వెల్లడించారు. వెనుకబడిన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో నడిపించేందుకు ప్రభుత్వం కృషి చేయాలని సూచించారు.