వ్యవసాయ, అనుబంధ రంగాల్లో నూతన ఆవిష్కరణల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ సంచాలకులు డాక్టర్ ఎల్.ప్రశాంతి.. ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సంకల్ప్-2021 విభాగంలో వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్ధికి ఊతమిచ్చేలా ఆలోచన చేసే ఔత్సాహికులను ఎంపిక చేసి రెండు నెలలపాటు శిక్షణ ఇచ్చి, రూ.5 లక్షల వరకు ఆర్థికసాయం అందజేస్తామన్నారు. సమృద్ధి-2021 విభాగంలో ఇప్పటికే వ్యవసాయ అనుబంధ రంగాల్లో అంకుర సంస్థలను ఏర్పాటు చేసుకున్న వారికి సంస్థ విస్తరణకు అవసరమైన శిక్షణ ఇస్తామని చెప్పారు. అలాగే రూ.25 లక్షల వరకు గ్రాంటు అందజేయనున్నట్లు స్పష్టం చేశారు.
వ్యవసాయ రంగ ఆవిష్కరణలకు దరఖాస్తుల ఆహ్వానం
వ్యవసాయ అనుబంధ రంగాల్లో నూతన ఆవిష్కరణల కోసం దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు తిరుపతి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రకటన విడుదల చేసింది. ఔత్సాహికులను ఎంపిక చేసి రెండు నెలలు శిక్షణ ఇచ్చి.. రూ.5 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేయనున్నట్లు తెలిపారు.
తిరుపతి పశువైద్య విశ్వవిద్యాలయం
ఒక్కో విభాగంలో 30 మందిని ఎంపిక చేస్తామని వివరించారు. ఆసక్తిగల వారు జూన్ 20లోగా దరఖాస్తు చేసుకోవాలని పరిశోధన స్థానం అగ్రి బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్ ప్రధాన పరిశోధకులు డాక్టర్ పి.బాలహుస్సేన్‌రెడ్డి సూచించారు. మరిన్ని వివరాలకు www.angraurabittpt.org, 9441670829లో సంప్రదించాలన్నారు.
ఇదీ చదవండి