ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసిన పుంగనూరు పోలీసులు - పుంగనూరు నేర వార్తలు

పుంగనూరు పోలీసులు ఓ అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.10 లక్షల విలువచేసే 17 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు..నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.

Inter State gang Arrested by Punganooru Police
అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసిన పుంగనూరు పోలీసులు

By

Published : Sep 18, 2020, 11:14 PM IST

చిత్తూరు జిల్లా పుంగనూరు పోలీసులు ఓ అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశారు. పుంగనూరు మండలం అరవపల్లిలో అనుమానాస్పదంగా కనిపించిన ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు ఏపీ సహా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో పలు నేరాలకు పాల్పడినట్లు గుర్తించారు. విచారణలో వారు ఇచ్చిన సమాచారం మేరకు.. 17 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు పుంగనూరు, మదనపల్లెకు చెందిన కిరణ్ కుమార్, ఆనంద్, రవితేజ, వెంకట సాయికుమార్​తో పాటు మరో మైనర్​గా గుర్తించారు. వీరి నుంచి రూ.10 లక్షల విలువచేసే 17ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details