చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి మండలంలో ఒక్కరోజు వ్యవధిలోనే రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. దీంతో అధికారయంత్రాoగం అప్రమత్తమైంది. మండలంలోని ముంగిలిపట్టు ,చంద్రగిరి టౌన్ లలో కేసులు రావటంతో ఆ ప్రాంతాలని రెడ్ జోన్ గా ప్రకటించి ప్రజలను అప్రమత్తం చేశారు.
చంద్రగిరి మండలంలో పెరుగుతున్న కరోనా కేసులు.. - caron apositive cases in chandraagiri
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అధికారులు స్థానికులను అప్రమత్తం చేస్తున్నారు.
చంద్రగిరి మండలంలో పెరుగుతున్న కరోనా కేసులు..
చంద్రగిరి పోలీస్ స్టేషన్ సమీపంలో కరోనా పాజిటివ్ రావడంతో టవర్ క్లాక్ జంక్షన్, పాతపేట,ముంగిలిపట్టు గ్రామాన్ని అధికారులు పర్యవేక్షించి ఆప్రాంతాలలో శుభ్రంచేసి, శానిటైజ్ చేసి బ్లీచింగ్ జల్లారు. పోలీసులు, ఆరోగ్యసిబ్బంది ఆప్రాంతాలలోని ప్రజలకు అందుబాటులో ఉండాలని అధికారులు ఆదేశించారు. ప్రభుత్వం ఎంత అప్రమత్తంగా ఉన్నా ప్రజలు నియమ నిబంధనలు పాటించకుంటే కష్టమే అని వాపోతున్నారు.