జీఎస్టీ ద్వారా రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం చేకూరిందని జీఎస్టీ, కస్టమ్స్ కమిషనర్ నరేష్ పెనుమాక తెలిపారు. కొంతమంది వ్యాపారస్థులు ప్రజల నుంచి జీఎస్టీ పేరుతో వసూళ్లు చేసి ప్రభుత్వానికి కట్టడం లేదన్నారు. అలాంటి వారిని గుర్తించి చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో స్వామివారి సేవలో ఆయన పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను కమిషనర్ కు అందజేశారు.
"జీఎస్టీ చెల్లింపులో జాప్యాన్ని సహించేది లేదు" - నరేష్ పెనుమాక
రాష్ట్రంలో జీఎస్టీ ద్వారా భారీగా ఆదాయం వచ్చిందని జీఎస్టీ, కస్టమ్స్ కమిషనర్ నరేష్ పెనుమాక తెలిపారు. జీఎస్టీ చెల్లింపులో జాప్యాన్ని సహించేది లేదన్నారు.
పన్ను పేరుతో ప్రజల్ని మోసం చేస్తే చర్యలు తప్పవన్న జీఎస్టీ కమిషనర్