ఓ వైపు లాక్డౌన్ కొనసాగుతుండగా.. మరోవైపు సారా తయారీదారులు రెచ్చిపోతున్నారు. తిరుపతి జీవకోన సమీపంలోని పార్వతిపురం వద్ద నాటుసారా తయారుచేస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. సారా తయారు చేస్తున్నారన్న సమాచారంతో అలిపిరి పోలీసులు దాడులు చేశారు. ఇంటిలోనే సారా తయారుచేస్తున్నవారితో పాటు.. సారా తయారుచేయడానికి వాడే ముడిసరకులు బెల్లం, చెక్క, యూరియా తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తిరుపతి జీవకోనలో అక్రమ సారా తయారీ - tirupati crime news
తిరుపతి జీవకోన సమీపంలో అక్రమంగా సారా తయారు చేస్తున్నారు. రహస్య సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు.
జీవకోన సమీపంలో అక్రమంగా సారా తయారు