చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా పూరిల్లు కాలి బూడిదైంది. ప్రమాద సమయంలో ఇంటిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. సుమారు మూడు లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు నాగరాజు ఆవేదన వ్యక్తం చేశాడు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునేలోపే ఇల్లు పూర్తిగా దగ్ధమైందని బాధితుడు వాపోయాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
షార్ట్ సర్క్యూట్తో పూరిల్లు దగ్ధం - fire accident latest news update
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో ఆగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా పూరిల్లు కాలి బూడిదైంది. ప్రాణనష్టం లేనప్పటికీ మూడు లక్షలు ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు.
షార్ట్ సర్క్యూట్తో పూరిళ్లు దగ్ధం