ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తంబళ్లపల్లెలో గాలివాన భీభత్సం - heavy rain in tamballapalli latest news

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె పరిధిలో మంగళవారం వీచిన గాలివానకు అపార నష్టం వాటిల్లింది. గ్రామంలోని విద్యుత్​ స్తంభాలు విరిగిపోగా... వందల సంఖ్యలో చెట్లు నేలకొరిగాయి.

heavy wind and rainfall in tamballapalli cosntituency and ress fell down heavily
మంగళవారం వీచిన గాలివానకు నేలకొరిగిన చెట్టు

By

Published : May 20, 2020, 7:28 AM IST

చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో గాలివాన భీభత్సం చేసింది. పెనుగాలుల ప్రభావానికి... రేకుల ఇళ్ల కప్పులు లేచిపోయాయి. పెద్దమండ్యం, తంబళ్లపల్లె మండలాల్లో నివాస గృహాలు ధ్వంసమయ్యాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి.

నియోజకవర్గంలోని చాలా ప్రాంతాల్లో పెద్ద పెద్ద చెట్లు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలగడం వల్ల అధికారులు మరమ్మతు కార్యక్రమాలు వేగవంతంగా చేపట్టారు. సరఫరాను పునరుద్ధరించారు. కొన్నిచోట్ల చివరి దశలోని మామిడి పంట దెబ్బతింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details