దళిత సంఘాలపై దాడిని నిరసిస్తూ దళితులు చేపట్టిన చలో మదనపల్లె కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. చిత్తూరు జిల్లా పోలీసులు ముందు జాగ్రత్తగా పటిష్ఠ చర్యలు చేపట్టారు. మదనపల్లెలో 600 మంది పోలీసులతో ప్రధాన కూడళ్లలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ఐదుగురు డీఎస్పీలు, 19 మంది సీఐలు, 16 మంది ఎస్ఐలతో మదనపల్లెలో భద్రత పర్యవేక్షిస్తున్నారు. ముందు జాగ్రత్తగా పలు దళిత సంఘాల నేతలను అరెస్టు చేశారు. కరోనా సమయంలో సమావేశాలు నిర్వహించడాన్ని అడ్డుకోవడానికే పోలీసులు చర్యలు చేపట్టారని డీఎస్పీ తెలిపారు. ముందు జాగ్రత్తగా 30 మందిని అరెస్టు చేశామని చెప్పారు.
మదనపల్లెలో 600 మంది పోలీసులు మోహరింపు - మదనపల్లెలో పోలీస్ పికెటింగ్
చలో మదనపల్లె కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. మదనపల్లెలో 600 మంది పోలీసులతో ప్రధాన కూడళ్లలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తగా పలు దళిత సంఘాల నేతలను అరెస్టు చేశారు.
మదనపల్లెలో పోలీస్ పికెటింగ్