కృష్ణా, చిత్తూరు జిల్లాల్లోని రెండు దేవాలయాలను తితిదే పరిధిలోకి తెస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కృష్ణా జిల్లా నిమ్మకూరులోని వేంకటేశ్వరస్వామి ఆలయం, చిత్తూరు జిల్లా కందులవారిపల్లిలోని శేషాచల లింగేశ్వరస్వామి ఆలయాలను తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి తీసుకువచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ రెండు ఆలయాల అభివృద్ధి, పునరుద్ధరణతోపాటు నిర్వహణ బాధ్యతలను తితిదే చేపట్టనుందని దేవాదాయశాఖ ఆదేశాల్లో పేర్కొంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ కార్యదర్శి ఉషారాణి ఉత్తర్వులు ఇచ్చారు.
తితిదే పరిధిలోకి మరో రెండు దేవాలయాలు - నిమ్మకూరు వేంకటేశ్వరస్వామి దేవాలయం వార్తలు
కృష్ణా, చిత్తూరు జిల్లాల్లోని రెండు దేవాలయాలను తితిదే పరిధిలోకి తీసుకువస్తూ... ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ రెండు దేవాలయాల నిర్వహణ, అభివృద్ధి బాధ్యతలను ఇకపై తితిదే చేపట్టనుంది.
తితిదే పరిధిలోకి మరో రెండు దేవాలయాలు
ఇదీ చదవండి :వెంకటేశుని నివాసం... ప్లాస్టిక్ రహితం...