రెండు నెలలుగా జీతాలు చెల్లించకుండా తమను మానసిక వేదనకు గురిచేస్తున్నారంటూ... తిరుపతి శ్రీదేవి కాంప్లెక్స్ సమీపంలో ప్రభుత్వ మద్యం దుకాణంలో పనిచేసే వ్యక్తి సెల్ టవర్ ఎక్కి ఆందోళన చేశాడు. చంద్రగిరి మండలం తొండవాడ ప్రభుత్వ మద్యం దుకాణంలో చరణ్ సేల్స్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. రెండు నెలలుగా జీతం ఇవ్వకుండా తమను వేధిస్తున్న అధికారుల తీరుకు నిరసనగా సెల్ టవర్ ఎక్కి నినాదాలు చేశాడు. సమాచారం అందుకున్న తిరుపతి తూర్పు పోలీసులు అతన్ని కిందకు దింపేందుకు ప్రయత్నించగా... ఎవరైనా తన వద్దకు వస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.
ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే వారిపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుందన్న చరణ్... ఎక్సైజ్ పోలీసుల వేధింపులకు ప్రభుత్వ మద్యం దుకాణాలు కేంద్రంగా మారయాని తన ఆవేదన వెలిబుచ్చాడు. ఇది కేవలం తన ఒక్కడి ఆవేదనే మాత్రమే కాదన్నాడు. అబ్కారీ శాఖకు సంబంధించిన ఉన్నత ఉద్యోగుల నుంచి స్పష్టమైన హామీ వస్తే తప్ప కిందకు దిగేది లేదని చెప్పాడు. పోలీసులు ఉద్యోగికి నచ్చజెప్పి కిందకు దింపే ప్రయత్నాలు చేశారు.