తిరుపతి రూరల్ మండలం, పుదిపట్ల పంచాయతీ నిధుల విడుదల విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని సర్పంచ్ బడి సుధాయాదవ్ ఆరోపించారు. గత కొంతకాలంగా నిధుల విడుదల కోసం పోరాటాలు చేస్తున్నా ఫలితం లేదన్న ఆయన.. చివరకు సొంత నిధులతో చెత్త సేకరణకు ట్రాక్టర్ ను ఏర్పాటు చేశారు. పంచాయతీ పరిధిలో చెత్త తరలించే ట్రాక్టర్లు, ఆటోలకు డీజిల్ పోసే పరిస్థితి లేక మూలనపడ్డాయన్నారు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా, ఇంటింటికి తిరిగి చెత్త సేకరిస్తూ నిరసన తెలిపిన స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని ఆయన కోరారు.
'ఆ విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసింది'
పంచాయతీ నిధుల విడుదల విషయంలో ప్రభుత్వం చేతులెత్తేసిందని తిరుపతి రూరల్ మండలం, పుదిపట్ల పంచాయతీ సర్పంచ్ బడి సుధాయాదవ్ ఆరోపించారు. కొంతకాలంగా నిధుల విడుదల కోసం పోరాటాలు చేస్తున్నా ఫలితం లేదన్నారు.
సర్పంచ్