ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనాతో మహిళ మృతి.. మంగళసూత్రం మాయం! - chain theft from corona died women

ఓ మహిళ కరోనాతో చనిపోతే చేతివాటం చూపించారు తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలోని దొంగలు. మృతి చెందిన మహిళ మెడలో మంగళసూత్రాన్ని మాయం చేశారు. ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నిస్తే వారు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారంటూ... బంధువులు పోలీసులను ఆశ్రయించారు.

కరోనాతో మహిళ మృతి.. మంగళసూత్రం మాయం!
కరోనాతో మహిళ మృతి.. మంగళసూత్రం మాయం!

By

Published : May 4, 2021, 7:50 PM IST

Updated : May 4, 2021, 8:52 PM IST

చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన ఓ మహిళ కరోనాతో బాధపడుతూ చికిత్స కోసం తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. మహమ్మారితో పోరాడుతూ.. ఆమె మృతి చెందారు. మెడలోని బంగారు మంగళసూత్రం లేకపోవటాన్ని గమనించిన కుటుంబ సభ్యులు.. ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించారు.

వారు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంపై ఆగ్రహించారు. ఆసుపత్రిలో చేరే సమయంలో మెడలో గొలుసు ఉన్న వీడియోతో మృతురాలి కుటుంబ సభ్యులు అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గొలుసు దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తులను పట్టుకునేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Last Updated : May 4, 2021, 8:52 PM IST

ABOUT THE AUTHOR

...view details