తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు వైభవంగా అంకురార్పణ జరిగింది. శ్రీవారి సేనాధిపతైన విష్వక్సేనులవారు ఊరేగింపుగా రంగనాయకుల మండపానికి చేరుకున్నారు. అనంతరం అర్చకులు అస్థానాలు నిర్వహించారు. యాగశాలలో వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ - తిరుమల నేటి వార్తలు
తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. కరోనా కారణంగా ఈసారి ఉత్సవాలు ఆలయంలో జరగనున్నాయి.
వైభవంగా తిరుమల నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
ఉత్సవాల్లో ఎలాంటి అంతరాయాలు ఏర్పడకుండా విజయవంతం కావాలని ప్రార్థిస్తూ... నవధాన్యాలను పాలికల్లో మొలకెత్తించారు. రేపటి పెద్ద శేషవాహన సేవతో వాహన సేవలు ప్రారంభమై తొమ్మిదిరోజులపాటు జరుగుతాయి. ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 8 వరకు వాహన సేవలు నిర్వహిస్తారు. 24న చక్రస్నానంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని రకరకాల విద్యుద్దీపాలు, పూలతో అలంకరించారు.
ఇదీచదవండి.
ముఖ్యమంత్రి జగన్కు సీబీఐ మాజీ డైరెక్టర్ లేఖ
Last Updated : Oct 15, 2020, 10:45 PM IST