తిరుపతి గ్రామ దేవత తాతయ్య గుంట గంగమ్మకు భక్తులు మారుపొంగళ్లు సమర్పించి మొక్కులు తీర్చుకొన్నారు. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది గంగమ్మ జాతర ఏకాంతంగా సాగింది. జాతర ముగింపు అనంతరం ఐదు వారాల పాటు మారు పొంగళ్ల పేరుతో భక్తులు మొక్కులు తీర్చుకోవటం సంప్రదాయం. ఏకాంతంగా జరిగిన జాతర ముగిసిన నాలుగో మంగళవారం భక్తులు మారు పొంగళ్ళు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారికి ఉదయం సుగంధద్రవ్యాలతో ఏకాంతంగా ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పండ్లతో పూర్ణ ఫల గామిని రూపంలో అలంకరించారు. పూర్ణ ఫల గామిని రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకొన్నారు. కోవిడ్ నిబంధనలు అనుసరిస్తూ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు భక్తులను దర్శనానికి అనుమతించారు.
పూర్ణ ఫల గామిని రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు - తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర వార్తలు
కరోనా నేపథ్యంలో తిరుపతి గ్రామ దేవత తాతయ్య గుంట గంగమ్మ జాతర ఏకాంతంగా సాగింది. జాతర ముగింపు అనంతరం గంగమ్మకు భక్తులు మారుపొంగళ్లు సమర్పించి మొక్కులు తీర్చుకొన్నారు.
పూర్ణ ఫల గామిని రూపంలో దర్శనమిచ్చిన అమ్మవారు
ఇవీ చదవండి
మద్యం మత్తులో ఇద్దరి మధ్య ఘర్షణ.. ఒకరు హతం!
TAGGED:
తిరుపతి తాజా వార్తలు