చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం చిన్న గాండ్ల వీధిలోని వినాయక విగ్రహానికి కరెన్సీ నోట్ల అలంకరణతో వినాయకుని మండపాన్ని తయారుచేశారు. రూ. 22 లక్షలు కరెన్సీ నోట్లను గణపయ్య మండపానికి నిలువు వరుసలలో ముస్తాబుచేశారు. విగ్రహం చుట్టు పైనుంచి కింది వరకు నోట్లను వేలాడదీయడంతో వినాయకుడు లక్ష్మీ వినాయకుడిగా వెలుగొందుతున్నాడు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు నిర్వహిస్తున్నారు.
కరెన్సీనోట్లతో గణపయ్య మండప అలంకరణ... - పలమనేరు
వినాయకుడు వివిధ ఆకృతులలో దర్శనమిస్తూ భక్తులను ఆకట్టుకుంటున్నాడు. పలమనేరులో మాత్రం రూపాయల ఆలంకరణలతో కొలువుతీరిన విఘ్నేషుడు ప్రత్యేకతను చాటుతున్నాడు.
Ganapayya Mandap decoration with currency notes at chinnagandla in chittore