చిత్తూరు జిల్లాలోని శేషాచల అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను నివారించడానికి టాస్క్ ఫోర్స్ నిరంతర కుంబింగ్ చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే ఎర్రచందనం చెట్లను కొట్టడానికి వెళుతున్న నలుగురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
శేషాచల అడవుల్లో నలుగురు ఎర్ర చందనం స్మగ్లర్లు అరెస్ట్ - చిత్తూరు జిల్లా వార్తలు
శేషాచల అడవుల్లో ఎర్రచందనం కోసం ప్రవేశిస్తున్న నలుగురు తమిళ స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. త్వరలోనే వారిని పంపిన ప్రధాన స్మగ్లర్లను అదుపులోకి తీసుకుంటామని ఆర్ఐ భాస్కర్ చెప్పారు.
శేషాచల అడవుల్లో నలుగురు ఎర్ర చందనం స్మగ్లర్లు అరెస్ట్
స్మగ్లర్లను పట్టుకోవడం కోసం రెండు బృందాలుగా ఏర్పడిన ఆర్ఎస్సైలు ఎం.వాసు, లింగాధర్ చిన్నగొట్టిగల్లు మండలంలోని భాకరాపేట అటవీ పరిధిలో నలుగురు స్మగ్లర్లును అరెస్టు చేశారు. వీరిని ప్రధాన స్మగ్లర్లు శివాజీ, పెరుమాళ్ అనే వ్యక్తులు పంపినట్లు విచారణలో తేలింది. త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటామని ఆర్ఐ భాస్కర్ తెలిపారు.
ఇదీ చదవండి:ఎస్ఈసీ వల్ల ఇబ్బంది పడిన అధికారులకు అండగా ఉంటాం: మంత్రి పెద్దిరెడ్డి