చిత్తూరు జిల్లా పుత్తూరు మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్‌ను ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. అనంతరం స్వయం సహాయక సంఘాలకు... బ్యాంకుల ద్వారా రుణ మంజూరు కార్యక్రమానికి హాజరయ్యారు. లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. పుత్తూరు మున్సిపాలిటీలో స్వయం సహాయ సంఘాలకు సంబంధించి 29 కోట్లు వచ్చే నాలుగేళ్లలో రుణమాఫీ చేయనున్నట్లు రోజా తెలిపారు. అదేవిధంగా సంఘ సభ్యులకు సైతం ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో వ్యాపారాల కోసం స్థలాలు ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
పుత్తూరులో ఫుడ్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా - mla roja
మెప్మా ఆధ్వర్యంలో పుత్తూరులో నిర్వహించిన ఫుడ్ ఫెస్టివల్‌ను నగరి ఎమ్మెల్యే రోజా ప్రారంభించారు. అనంతరం స్వయం బ్యాంకుల ద్వారా రుణాలు పొందిన స్వయం సహాయక సంఘాలకు చెక్‌లను అందించారు.
పుత్తూరులో ఫుడ్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే రోజా