ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'చెరువు నీళ్లు వృథాగా పోతున్నాయ్.. గేట్లు మూసేయండి'

By

Published : Dec 19, 2020, 8:42 AM IST

అది శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన రాయలచెరువు. రైతుల మేలు కోసం రాయలవారు 1570 ఎకరాల్లో చెరువు తవ్వించగా.. ప్రస్తుతం 45.80 ఎకరాలు మాత్రమే మిగిలి ఉంది. చెరువు ఆక్రమణలకు గురికావడంతో.. నీటి నిల్వకు అవకాశం లేకుండా పోయింది. నీటిని కిందకు విడుదల చేయడంతో.. పొలాలు నీట మునిగి రైతులు నష్టపోతున్నారు. దశాబ్దాల తర్వాత నిండిన చెరువు.. ఖాళీ అవుతుండడంతో.. ఆయకట్టు రైతులు కన్నీరు పెడుతున్నారు.

farmers water problems
farmers water problems

చెరువు ఖాళీ అవుతుందని ఆయకట్టు రైతుల ఆవేదన

చిత్తూరు జిల్లా రాయలచెరువు సమీపంలో 1570 ఎకరాల విస్తీర్ణంలో శ్రీకృష్ణదేవరాయలు.. సాగునీటి చెరువును నిర్మించారు. రాయలచెరువు క్రమేణా ఆక్రమణలకు గురవడంతో పాటు మునక పట్టాలు జారీ చేయడంతో.. ప్రస్తుతం 45.80 ఎకరాలు మాత్రమే మిగిలింది. ఈ చెరువు అధికారికంగా 1280 ఎకరాలకు, అనధికారికంగా దాదాపు 12 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తోంది. వర్షపు నీటితో దాదాపు 23 సంవత్సరాల తర్వాత చెరువు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరింది.

సాగునీటి కొరత తీరుతుందని రైతులు ఆనందంలో ఉండగా.. సీకే పల్లి గ్రామ పంచాయతీకి ముంపు పొంచి ఉందటూ.. అధికారులు ఒక గేటు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. అయితే గుర్తుతెలియని వ్యక్తులు.. మిగిలిన రెండు గేట్లను కూడా ఎత్తి నీటిని కిందకు వదిలేశారు. పొలాలు ముంపుతో పాటు చెరువు ఖాళీ అవుతుండడంతో.. రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువుకు దక్షిణం వైపు మొరవ ఉంది. నీరు మొరవకు కూడా చేరక ముందే.. గేట్లు ఎత్తడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చెరువు ఇంకా 40 శాతం ఖాళీగా ఉందని.. ఒక పంచాయతీ కోసం..13 పంచాయతీల ప్రజలకు నష్టం చేస్తున్నారని.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని.. అధికారులు ఒక గేటు ఎత్తి నీరు దిగువకు విడుదల చేశారు. రోజులు గడుస్తున్నా అధికారులు గేట్లు మూయకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ఇసుక సమస్య.. అనుకూలంగా మార్చుకుంటున్న అక్రమార్కులు..!

ABOUT THE AUTHOR

...view details