రాష్ట్ర రాజధాని తుళ్ళూరు దళితుల రక్తంతో తడిచిందంటూ కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అది శపించబడిన ప్రాంతమనీ, అక్కడ రాజధాని ఉన్నంత వరకూ జగన్మోహన్ రెడ్డి రాణించలేరని అన్నారు. చంద్రబాబు ఓటమికి రాజధాని అమరావతే ప్రధానకారణం అన్నారు. రాజధాని ప్రాంతం అంత శ్రేయస్కరం కాదని ఆయన హెచ్చరించారు. తుళ్ళూరు రాజధానిగా ఎన్నుకోవడం వలనే చంద్రబాబు కాలు జారిపడ్డారనీ వ్యంగ్యాస్త్రాలు వేశారు. రాజధానికి తిరుపతి సరైన ప్రాంతం అని అన్నారు. మహారాష్ట్ర ఎన్నికలు అవ్వగానే హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేస్తారని చింతామోహన్ వ్యాఖ్యానించారు. రాయలసీమలో ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే రష్యాలో పేదవాళ్లకు 7 వేల కోట్లు ప్రధాని ఇవ్వడం విడ్డూరం అని విమర్శించారు. దేశంలో ఉన్న సమస్యలను మర్చిపోవటానికే ప్రధాని విదేశీ ప్రయాణం అని ఆరోపించారు.
చంద్రబాబు ఓటమికి అమరావతే కారణం.. జగన్ మీరు జాగ్రత్త..! - రాజధాని
రాష్ట్ర రాజధానిఅమరావతిపై కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి శపించబడిన ప్రాంతమని..రాజధానిగా శుభసూచకం కాదని వ్యాఖ్యానించారు.
రాజధానిపై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు