ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్ రమేష్‌కుమార్ అరెస్ట్

తిరుపతి ఈఎస్‌ఐ ఆసుపత్రి పూర్వ సూపరింటెండెంట్‌.., ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్ రమేష్‌కుమార్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్లలో అక్రమాలకు సంబంధించి.. విజయకుమార్‌ను అరెస్ట్‌ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

ramesh kumar arrest
ramesh kumar arrest

By

Published : Jun 12, 2020, 12:42 PM IST

Updated : Jun 12, 2020, 12:56 PM IST

ఈఎస్‌ఐ ఆసుపత్రులకు సంబంధించి మందులు, వైద్య పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు చోటు చేసుకున్నాయని వైకాపా ప్రభుత్వం విజిలెన్స్‌ అండ్ ఎన్‌ఫోర్స్‌ మెంట్ దర్యాప్తునకు ఆదేశించింది. ఈఎస్‌ఐలో అవినీతి జరిగినట్లు విజిలెన్స్‌ దర్యాప్తులో తేలింది. నకిలీ కొటేషన్లతో ఆర్డర్లు ఇచ్చినట్టు విజిలెన్స్‌ అధికారులు గుర్తించారు. విజిలెన్స్‌ కమిటీ నివేదిక ఆధారంగా ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది.

ఈ క్రమంలో తిరుపతి ఈఎస్‌ఐ ఆసుపత్రి పూర్వ సూపరింటెండెంట్‌.., ఈఎస్‌ఐ మాజీ డైరెక్టర్ రమేష్‌కుమార్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్‌ చేశారు. తిరుపతి బైరాగిపట్టెడ ప్రాంతంలో ఉన్న రమేష్‌కుమార్‌ ఇంటి వద్ద ఆయనను అదుపులోకి తీసుకొన్నారు. అనిశా అధికారులు తిరుపతి ఏసీబీ కార్యాలయానికి ఆయనను తీసుకెళ్లి విచారించారు. అనంతరం విజయవాడకు తరలించారు. తెల్లవారు జామున విజయవాడ నుంచి వచ్చిన అనిశా ప్రత్యేక బృందం రమేష్ కుమార్​ను అరెస్ట్‌ చేసింది. ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్లలో అక్రమాలకు సంబంధించి.. విజయకుమార్‌ను అరెస్ట్‌ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. రమేష్‌కుమార్‌ కుటుంబ సభ్యులను ఏసీబీ కార్యాలయానికి పిలిపించి మాట్లాడించిన తర్వాత విజయవాడకు తరలించారు.

ఇదీ చదవండి:చేనేత కార్మికులకు లాక్​డౌన్ కష్టాలు

Last Updated : Jun 12, 2020, 12:56 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details