చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. వెదురుగుట్టపల్లె, బీఎం గొల్లపల్లె, తిమ్మరాజుపల్లిలో ఏనుగుల స్వైర విహారం చేశాయి. పంట పొలాలు, జనావాసాల్లో ఏనుగులు సంచరిస్తుంటే.. ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పంటపొలాల్లో సంచరిస్తూ తమకు నష్టం కలిగించటంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఏనుగులను అడవుల్లోకి మళ్లించేందుకు పయత్నాలు చేపట్టారు. ఉదయం కర్ణాటక పరిధిలోని అడవుల నుంచి ఏనుగులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు.
elephants: ఏనుగుల స్వైర విహారం.. ఆందోళనలో ప్రజలు - చిత్తూరు జిల్లాలో ఏనుగుల సంచారం
చిత్తూరు జిల్లాలో ఏనుగుల హల్చల్ చేశాయి. జనావాసాల్లోకి వచ్చిన వాటిని చూసి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు.. ఏనుగులను అడవుల్లోకి మళ్లించేందుకు పయత్నాలు చేపట్టారు.
elephants
Last Updated : Oct 4, 2021, 11:45 AM IST