చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని శేషాచలం అటవీ ప్రాంతం సమీప గ్రామాల్లో ఏనుగుల బెడద ఎక్కువగాఉంది. పొలాలపై గజరాజులు దాడులు చేస్తున్నాయి. ఏ.రంగంపేట, నరసింగాపురంలో గత వారం రోజులుగా ఏనుగులు దాడులు జరుగుతున్నాయి. అటవీశాఖ అధికారులు, ప్రజలు కలసి ఎన్నిసార్లు వాటిని అడవిలోకి తరిమిన తిరిగి మళ్ళీ పంట పొలాలపైకి వస్తున్నాయి. వరి, మామిడి తోటలను అధికంగా నష్ట పరుస్తున్నాయి. అటవీశాఖ అధికారులు చొరవ చూపి వాటిని పంట పొలాలపై రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని రైతులు, గ్రామస్థులు కోరుతున్నారు.
శేషాచలం అడవుల్లో గజరాజుల బీభత్సం
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శేషాచలం అటవీ ప్రాంతం సమీప గ్రామాల్లో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పంటలపై దాడులు చేసి ధ్వంసం చేస్తున్నాయి.
చంద్రగిరి మండలంలో రెచ్చిపోతున్న గజరాజులు