ఓ తల్లి మనసు మరో తల్లికి మాత్రమే తెలుస్తుంది. శత్రువుల పిల్లలైనా సరే ఆకలితో అలమటిస్తుంటే.. అమ్మ మనసు తల్లడిల్లిపోతుంది. ఏం చేసైనా సరే వాళ్ల ఆకలి తీర్చాలనుకుంటుంది. ఇలా కేవలం మనుషులే అలా ఆలోచిస్తారనుకుంటే పొరపాటు.. తల్లిగా ఏ జంతువైనా తన బిడ్డలను కాపాడుకుంటుంది. అలాగే వేరే వాళ్ల పిల్లలనూ.. అందులోనూ చిన్న పిల్లలతే వాటికి ఏ కష్టం వచ్చినా తీర్చేందుకు ముందుంటాయి మాతృమూర్తులు. ఇదంతా నిజమేనా అనిపిస్తోందా..! నిజమేనండీ.. కావాలంటే ఈ శునకాన్ని చూడండి.
WONDER: పిల్లి పిల్లలకు పాలిస్తున్న శునకం.. ఆశ్చర్యపోతున్న ప్రజలు..! - ap 2021 news
శునకాన్ని చూస్తే పిల్లి ఆమడ దూరం పరిగెడుతుంది. అదే శునకం పిల్లిని చూస్తే.. ఎలాగైనా సరే పట్టుకోవాలనుకుంటుంది.కానీ ప్రకృతికి విరుద్ధంగా.. ఆకలితో అలమటిస్తున్న రెండు పిల్లి పిల్లలకు శునకం పాలిచ్చి తల్లి మనసును చాటుకుంది.
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం రామానుజపల్లిలో ఓ శునకం.. పిల్లి పిల్లలకు పాలిస్తోంది. పిల్లుల తల్లికి ఏమయిందో తెలియదు గానీ.. గత కొంతకాలంగా పిల్లి పిల్లలు ఆకలితో అలమటిస్తున్నాయి. ఆకలిని తట్టుకోలేక ఆ సమయంలో పక్కనే ఉన్న ఓ శునకం దగ్గకరు వెళ్లి పాలు తాగాయి. శునకం కూడా ఏం అనకుండా అక్కున చేర్చుకొని వాటి ఆకలి తీర్చింది. అప్పటినుంచి ప్రతిరోజూ పిల్లి పిల్లలు శునకం పాలే తాగుతున్నాయి. జాతి వైరం ఉన్నప్పటికీ.. పిల్లి పిల్లలు శునకం పాలు తాగడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఇదీ చూడండి:Tollywood Drugs Case: ఈడీ విచారణకు హాజరైన నటుడు నవదీప్