తితిదే డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించనున్నారు. తితిదే పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో కార్యక్రమాన్ని నిర్వహించేందుకు నిర్ణయించారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల వరకు భక్తులు ఈవో జవహర్ రెడ్డితో ఫోన్ ద్వారా మాట్లాడే సదుపాయం కల్పిస్తారు. భక్తులు 0877-2263261 నంబరు ద్వారా తమ సందేహాలు, సూచనలు ఈవోతో మాట్లాడవచ్చు. కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ద్వారా ప్రత్యక్షప్రసారం చేస్తుంది.
ఉదయాస్తమాన సేవా భక్తులకు వీఐపీ దర్శనం...!
తిరుమల శ్రీవారి ఉదయాస్తమాన సేవ, వింశతి వర్ష దర్శని పథకాల టిక్కెట్లు కలిగిన భక్తులకు బ్రేక్ దర్శనం ద్వారా తితిదే దర్శనం కల్పిస్తోంది. కరోనా కారణంగా గత ఏడాది మార్చి 13 నుంచి ఆర్జిత సేవలను తితిదే రద్దు చేసింది. ఉదయాస్తమాన టికెట్లు కలిగిన భక్తుల విజ్ఞప్తి మేరకు శ్రీవారి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో శ్రీవాణి ట్రస్టు భక్తులతో పాటు వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో అనుమతి ఇవ్వనున్నారు.
ఉదయాస్తమాన సేవ, వింశతి వర్ష దర్శిని పథకాల టికెట్లు ఉన్న భక్తులు ఆన్‌లైన్‌లో డోనార్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ పోర్టల్ ద్వారా బ్రేక్ దర్శనం టికెట్లు పొందే అవకాశాన్ని తితిదే ప్రారంభించింది. నేటి నుంచి నూతన విధానం ద్వారా టికెట్లు పొందాలని భక్తులను తితిదే కోరుతోంది. ఇతర వివరాలకు ఆర్జితం కార్యాలయం ఫోన్ నెం - 0877-2263589 లేదా ఈ - మెయిల్ arjithamoffice@gmail.com కు సంప్రదించాలని తితిదే ప్రకటించింది.
ఇదీ చూడండి:నాడు-నేడు.. నాణ్యత విషయంలో రాజీపడొద్దు: సీఎం జగన్