మదనపల్లెలో దళిత, ప్రజాసంఘాల ధర్నా - madanapalle
తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన దారుణ హత్యను నిరసిస్తూ... త్తూరు జిల్లా మదనపల్లె ఉపపాలనాధికారి కార్యాలయం ఎదుట దళిత, ప్రజాసంఘాలు ధర్నా చేపట్టాయి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.
తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలం లింగంపల్లిలో అగ్రవర్ణాల వారు భక్తి శ్రీనివాసులు అనే యువకుడికి ఉరి వేసిన సంఘటనపై న్యాయం చేయాలంటూ దళిత, ప్రజాసంఘాల నాయకులు ధర్నా చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లె ఉప పాలనాధికారి కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాయకులు పలు నినాదాలు చేశారు. శ్రీనివాసులును చంపిన నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని,.. బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.