చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయం దర్శించుకున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పది రోజులుగా ప్రసాదాల కేంద్రాల్లో సౌకర్యాలు అందుబాటులో ఉండటం లేదు. కొనుగోలు చేసిన వస్తువులను నివాసాలకు తీసుకెళ్లేందుకు భక్తులు అవస్థలు పడుతున్నారు. ఆలయానికి రూ.లక్షల్లో ఆదాయం వస్తున్నప్పటికీ చిన్నపాటి ప్రసాదాల సంచులను ఏర్పాటు చేయకపోవడం దారుణమని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తులకు పెరిగిన ఇక్కట్లు - చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయం దర్శించుకున్న భక్తులు
శ్రీకాళహస్తీశ్వరాలయంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రసాదాల సంచులను ఏర్పాటు చేయకపోవడంతో పది రోజులుగా అసౌకర్యానికి గురవుతున్నారు. ఆలయానికి రూ.లక్షల్లో ఆదాయం వస్తున్నప్పటికీ భక్తులకు మాత్రం ఇక్కట్లు తప్పడం లేదు.
భక్తులకు పెరిగిన ఇక్కట్లు