ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాణిపాకం ఆలయానికి రూ.31.50 లక్షలు విరాళమిచ్చిన భక్తుడు - కాణిపాకం తాజావార్తలు

చిత్తూరు జిల్లాలోని కాణిపాకం ఆలయానికి ఓ భక్తుడు భారీగా విరాళం అందజేశాడు. ఆలయ అభివృద్ధికి రూ.31.50లక్షలు అందించారు. ఈ మొత్తాన్ని చెక్కు​ రూపంలో ఆలయ ఈవోకి ఇచ్చారు.

donation to kanipakam temple
కాణిపాకం ఆలయానికి విరాళం

By

Published : Jun 26, 2021, 8:18 PM IST

చిత్తూరు జిల్లాలోని వరసిద్ధి వినాయకుడి కాణిపాకం ఆలయానికి సుబ్బారావు అనే భక్తుడు విరాళం అందించాడు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సుబ్బారావు ఆలయాభివృద్ధికి రూ.31.50లక్షలు ఇచ్చాడు. గోసంరక్షణ ట్రస్ట్​, భక్తుల వసతి సముదాయ ట్రస్ట్​కు తొమ్మిది లక్షల చొప్పున, నిత్యాన్నదానం ట్రస్ట్​కు ఏడు లక్షలు, బంగారు రథం నిర్మాణానికి ఆరున్నర లక్షల రూపాయలు విరాళం అందించారు. ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో ఆలయ ఈవో వెంకటేశ్​కి ఇచ్చారు. ఆలయ అభివృద్ధికి విరాళమిచ్చిన సుబ్బారావు కుటుంబసభ్యులకు ఆలయ పండితులు వేదాశీర్వచనం ఇచ్చి, స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details