చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వచ్చే భక్తుల కోసం.. దక్షిణ భారత దేవాంగ సంక్షేమ సంఘం ప్రతినిధులు నిర్మిస్తున్న సత్రం పనులు జోరుగా సాగుతున్నాయి. శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన రాజ గోపురానికి ఆనుకొని ఉండే దేవాంగుల సత్రం రాజగోపురం కూలడంతో.. దేవాంగుల సత్రానికి ముక్కంటి ఆలయ అధికారులు భరద్వాజ తీర్థం వద్ద స్థలం కేటాయించారు. ఈ స్థలంలో.. దక్షిణ భారత దేవాంగ సంక్షేమ సంఘం ప్రతినిధులు రూ.6 కోట్ల నిధులు సేకరించి సత్రాన్ని నిర్మిస్తున్నారు.
శ్రీకాళహస్తిలో.. రూ.6కోట్లతో సత్రం నిర్మాణ పనులు - chittoot latest news
శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చే భక్తుల కోసం.. దక్షిణ భారత దేవాంగ సంక్షేమ సంఘం ప్రతినిధులు సత్రం నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణం కోసం రూ.6కోట్ల నిధులు సేకరించారు. సత్రం నిర్మాణం పనులు వేగంగా సాగుతున్నాయి.
devangula satram works in progress in chittor