ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముస్లింల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, అందులో భాగంగా తనకు మంత్రి పదవి వచ్చిందని డిప్యూటీ సీఎం అంజద్ బాషా అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్క ముస్లిం మైనార్టీ కి కూడా పదవులు ఇవ్వలేదని విమర్శించారు. నామినేటెడ్ పదవులు స్థానిక సంస్థలలో 50 శాతం రిజర్వేషన్ బీసీలకు అమలు చేయనున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాలో ముస్లిం సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాల తీరుతెన్నులపై ఆయన సమీక్షించారు.
మైనార్టీలకు పెద్ద పీఠవేసింది జగన్ ప్రభుత్వమే :ఉపముఖ్యమంత్రి - అంజద్భాషా
గతంలో ఏ ప్రభుత్వము మైనార్టీలకు ప్రాథాన్యత ఇవ్వలేదని,మైనార్టీలకు పెద్ద పీఠవేసిన ఘనత ఒక్క జగన్మోహన్రెడ్డికే దక్కిందని ఉపముఖ్యముంత్రి అంజద్భాషా అన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లెకు వచ్చిన ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
సమావేశంలో మాట్లాడుతున్న ఉపముఖ్యమంత్రి