చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో రూ. 80 కోట్లతో ఆధునీకరించిన 120 కిలోమీటర్ల రహదారులను.. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రారంభించారు. సచివాలయాలు, సురక్షిత తాగునీటి పంపిణీ కేంద్రాలను ప్రారంభించారు.
జిల్లాలో తాగునీటి కొరత లేకుండా ప్రత్యేక ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని మంత్రులు తెలిపారు. నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రెడ్డప్ప, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఉన్నారు.