ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సంపూర్ణ మద్యపాన నిషేధానికి కృషి చేస్తున్నాం: డిప్యూటీ సీఎం - రాష్ట్రంలో మద్యపాన నిషేదం వార్తలు

రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధానికి ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తెలిపారు. ఇప్పటికే 12 వందల దుకాణాలు రద్దు చేశామన్న ఆయన..ఈ ఏడాది మరో వెయ్యి మద్యం షాపులు రద్దు చేసేందుకు నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

deputy cm
deputy cm

By

Published : May 12, 2020, 3:03 PM IST

పాదయాత్రలో ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటున్నారని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. దశలవారీగా సంపూర్ణ మద్యపాన నిషేధానికి అడుగులు వేస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే మొదటి ఏడాది దాదాపు 12 వందల దుకాణాలు రద్దు చేశామన్నారు. ఈ ఏడాది మరో వెయ్యి మద్యం షాపులు రద్దు చేసేందుకు ఇప్పటికే జీవో జారీ చేసినట్లు తెలిపారు. లాక్​డౌన్​ సందర్భంగా మద్యం దుకాణాలు తెరచి ధరలు పెంచిన రోజు నుంచి చూస్తే 20 నుంచి 30 కోట్లు నష్టం వచ్చినట్లు తెలిపారు. ప్రతిపక్షనేత చంద్రబాబు సంపూర్ణ మద్యపాన నిషేధానికి అనుకూలమా.. ప్రతికూలమా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details