చిత్తూరు జిల్లాలోని గ్రామాల్లో నాటుసారాను అరికట్టడానికి పోలీసులకు వాలంటీర్లు సహకరించాలని ఉప ముఖ్య మంత్రి నారాయణస్వామి కోరారు. సహకరించని వాలంటీర్లను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం టీఆర్.పురంలో పేదలకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. గ్రామంలో నెలకొన్న పరిస్థితులపై గ్రామస్థులను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో నాటుసారా విచ్చలవిడిగా తయారవుతున్నందున అధికారులు తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. మండలంలోని చెరువులను అభివృద్ధికి సహకారం అందిస్తామని తెలిపారు.
'నాటుసారా అడ్డుకట్టకు వాలంటీర్లు సహకరించాలి' - చిత్తూరు జిల్లా వార్తలు
చిత్తూరు జిల్లా టీఆర్.పురంలో పేదలకు నిత్యావసరాల పంపిణీ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లాలో నాటుసారాను అరికట్టడానికి పోలీసులకు వాలంటీర్లు సహకరించాలని కోరారు.
పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి